ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది, అప్పటికీ తన స్నేహితులు రైలు ఎక్కకపోవడంతో తనలో ఆందోళన మొదలైంది, వెంటనే రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో తలతో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీపు భాగంలో స్వల్ప గాయాలు ఉన్నట్టు గుర్తించారు. తలకు ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. తలకు బలమైన గాయాలు కాకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. కరిష్మా శర్మ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కరిష్మాను చూసి తాను షాక్ అయ్యానని ఆమె స్నేహితురాలు తెలిపారు. ఆమె రైలు నుంచి కిందపడిన వెంటనే తమను గుర్తు పట్టలేదన్నారు. ‘రాగిని ఎంఎంఎస్: రిటర్న్’, ‘ప్యార్ కా పంచనామా2’ లో నటించారు. కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ వంటి రియాలిటీ షోలలో నటించి అలరించారు.
Also Read: యూరియా కొరత పాలకుల సృష్టి!