మేషం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. సంతానానికి సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి.
వృషభం – మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదిస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాల పైన దృష్టి సారిస్తారు. పోటీ పరీక్షలలో మెరుగైన ఫలితాలు పొందుతారు.
మిథునం – వ్యాపారంలో గుడ్ విల్ ను పెంపొందించుకోగలుగుతారు. అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి అడుగును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వేస్తారు.
కర్కాటకం – అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
సింహం – ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పెండింగ్ లో ఉన్న బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి అంశాలు లాభిస్తాయి.
కన్య – నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ రంగాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత చేదు అనుభవాలు ఎదురవుతాయి.
తుల – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. మీకు రావాల్సిన బిల్స్ చేతికి అందుతాయి. శ్రమకు తగ్గ ఫలితం పొందగలుగుతారు. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం – సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వారితో పరిచయాలు ఏర్పడతాయి. పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు – అదృష్టాన్ని నమ్ముకోకుండా కృషికి ప్రాముఖ్యతను ఇచ్చి అధికంగా శ్రమిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడతాయి.
మకరం – ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.
కుంభం – ప్రతి పనిని ఆలోచించి సమర్థవంతంగా చేయగలుగుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చెల్లించిన బిల్లులనే మళ్లీ చెల్లించాల్సి రావచ్చు జాగ్రత్తలు పాటించండి.
మీనం – ఆరోగ్య విషయంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతారు.