Thursday, June 5, 2025

కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు చీవాట్లు

- Advertisement -
- Advertisement -

కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని నటుడు, ఎంఎన్ ఎంఅధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బ తీయడం సరికాదని స్పష్టం చేసింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, మరొకరు కావచ్చు ప్రజల మనోభావాలను దెబ్బతీయ రాదని ధర్మాసనం పేర్కొంది. థగ్ లైఫ్ సినిమా విడుదలను నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కమల్ తరుపు దాఖలైన పిటిషన్ లో క్షమాపణ ప్రస్తావనే లేదని ధర్మాసనం
పేర్కొంది. కమల్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి ప్రకటన చేయకూడదు. కర్ణాటక ప్రజలు క్షమాపణ కోరుతున్నారని, మీరు క్షమాపణ చెప్పకుండా రక్షణకోసం కోర్టును ఆశ్రయిస్తున్నారని కోర్టు చెప్పినట్లు లైవ్ లా నివేదిక పేర్కొంది.

కమల్ హాసన్ ఏ ప్రాతిపదికన ఈ ప్రకటన చేశారని కోర్టు నిలదీసింది. మీరు చరిత్రకారుడా.. భాషా వేత్త నా.. ఏ ప్రాతిపదికన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించింది. మే నెల చివరి వారంలో చెన్నైలో థగ్ లైఫ్ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తాయి. జూన్ 5న థగ్ లైఫ్ అనే సినిమా థియేటర్లలో రిలీజ్ కావలసి ఉంది.కాగా, నిజం చెప్పినందుకు క్షమాపణ చెప్పాలా అంటూ కమల్ హాసన్ నిరాకరించారు. కమల్ వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకోవాలని కర్ణాటక ఫిల్మ్ పరిశ్రమ ప్రముఖులు నిర్ణయించడంతో అ సినిమా విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

క్షమాపణ చెప్పాలన్న హైకోర్టు
75 ఏళ్ల క్రితం రాజ్ గోపాల్ ఆచార్య అనే వ్యక్తి ఇలాంటి ప్రకటన చేసిన విషయాన్ని ప్రస్తావించిన కర్ణాటక హైకోర్టు ఆచార్య క్షమాపణ చెప్పినట్లే .. కమల్ హాసన్ కూడా క్షమాపణ చెప్పడం సముచితమని పేర్కొంది. మణిరత్నం సినిమా నిర్మించారని చెబుతున్న మీకు దాని ప్రాముఖ్యత తెలుసు. కానీ మీరు ప్రత్యక్షంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. వాక్ స్వాతంత్రం, భావప్రకటనా హక్కు ఉన్నా.. అది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉపయోగించకూడదని హైకోర్టు హితవు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News