Saturday, July 26, 2025

ప్రేమపెళ్లి… గర్భవతిని చంపి… మృతదేహంతో రెండు రోజులు గడిపి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు రావడంతో భార్యను చంపేసి, మృతదేహంతో రెండు రోజులు గడిపాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కుశి నగర్‌కు చెందిన శివమ్ అనే పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు సుమనా అనే అమ్మాయిని గత ఐదు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించాడు. కుటుంబ సభ్యులను ఎదురించి ఆరు నెలల క్రితం ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఐదు నెలల క్రితం వారు బెంగళూరు మకాం మార్చారు.

భార్య మూడు నెలల గర్భవతి ఉంది. గత కొన్ని రోజుల నుంచి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి భార్యపై భర్త దాడి చేయడంతో ఆమె మరో రూమ్‌లో పడుకుంది. మంగళవారం ఉదయం ఆమె నిద్ర నుంచి లేవకపోవడంతో భోజనం తయారు చేసుకొని పెయింటర్ పనికి వెళ్లిపోయాడు.

అదే రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి పడుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున భార్యను లేపడానికి ప్రయత్నించాడు. ఆమె అచేతనంగా పడిఉండడంతో చనిపోయిందని భావించాడు. ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా మృతదేహం బెడ్ పై కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News