మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు పెను ఉత్పాతానికి దారితీశాయి. బుధవారం వేర్వేరు ఘటనలలో ఓ వ్యక్తి ఆకస్మిక వరదలలో కొట్టుకుపోయాడు, 18 సంవత్సరాల బాలుడు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. నాగ్‌పూర్ జిల్లాలో భారీ వర్షాలతో 71 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజలు నిర్వాసితులు అయ్యారని అధికారులు నిర్థారించారు. నాగ్‌పూర్, వార్థా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారుల సూచించారు. మహారాష్ట్రలో పలు ప్రాంతాలలో భారీ లేదా ఓ మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగ్‌పూర్‌కు దగ్గరిలోని బోరాగావ్ గ్రామంలో 35 సంవత్సరాల అనిల్ హనుమంత్ పనపట్టే ఉదయం పొంగిపొర్లిన ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి చనిపోయాడు. ఇక ఉప్పల్‌వాడిలో ఓ కాలువ పొంగిపొర్లడంతో 18 సంవత్సరాల బాలుడు కార్తీక్ శివశంకర్ లాడ్సే నీటి వేగానికి కొట్టుకుపోయాడు. జాడ తెలియకుండా ఉన్నాడు.