తిరువనంతపురం: మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నాడని పక్కషాపు వ్యక్తిపై ఓ మహిళ యజమానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై అతడు థిన్నర్ పోసి తగలబెట్టడంతో చనిపోయింది. ఈ సంఘటన కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో జరిగింది. బేడడుక గ్రామంలో రమిత(32) మహిళ కిరాణ షాపును నిర్వహిస్తోంది. రామామృతం అనే అవ్యక్తి ఆమె షాపు పక్కన ఫర్నిషర్ షాపును నడుపుతున్నాడు. రామామృతం అనే వ్యక్తి ప్రతీ రోజు మద్యం తాగొచ్చి న్యూసెన్స్ చేసేవాడు.
దీంతో రమిత భవన యజమానికి ఫిర్యాదు చేయడంతో షాపు ఖాళీ చేయమని రామామృతాన్ని హెచ్చరించాడు. దీంతో రమితపై పగ పెంచుకున్న రామామృతం ఈ నెల 8న ఆమెపై థిన్నర్ పోసి తగలబెట్టాడు. దీంతో మంటలలలో చిక్కుకొని కేకలు వేసింది. స్థానికులు మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 50 శాతం గాయాలయ్యానని వైద్యులు తెలిపారు. మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. రామామృతాన్ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.