Tuesday, July 15, 2025

యాదాద్రిలో ప్రియుడితో కలిసి భర్తను కారుతో ఢీకొట్టి హత్య

- Advertisement -
- Advertisement -

కాటేపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సినీఫక్కీలో భర్తను భార్య హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య కారుతో ఢీకొట్టి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం ఉదయం కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాను పరిశీలించారు. స్వామి బైక్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టినట్లు పోలీసుల గుర్తించారు. స్వామిని కావాలనే కారుతో ఢీకొట్టినట్టు అనుమానాలు రావడంతో మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కారును రెంటుకు తీసుకొని ప్రియుడితో కలిసి భర్తను చంపినట్టు ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో బామ్మర్ధి ప్రమేయంతో పాటు ఇద్దరు సుపారీ కిల్లర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News