- Advertisement -
హైదరాబాద్: సైనికులను కించపరిచేలా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని, దేశం ప్రశాంతంగా ఉందంటే సైనికులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లేఖ తండ్రి, కూతురుకు సంబంధించినదని అన్నారు. కవిత లేఖపై సాయంత్రం స్పందిస్తానని అన్నారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..2018 ఎన్నికలప్పుడే బిఆర్ఎస్ పొత్తు అంటే వ్యతిరేకించామని, రాజకీయంగా మమ్మల్ని తిట్టండి, సైనికులను కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సర్జికల్ స్ట్రెక్ పై మాజీ సిఎం కెసిఆర్, కవిత ఆధారాలు అడిగారని అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
- Advertisement -