పరామర్శకు వచ్చిన నేతలను
అడిగి తెలుసుకున్న బిఆర్‌ఎస్
అధినేత యూరియా, ఎరువుల
లభ్యత, వ్యవసాయం, సాగునీరు
గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న మాజీ
సిఎం ఆసుపత్రిలో కోలుకుంటున్న
కెసిఆర్ సాధారణ పరీక్షల కోసమే
ఆసుపత్రిలో చేరినట్లు బిఆర్‌ఎస్
అగ్రనేత కెటిఆర్ వివరణ
మన తెలంగాణ/హైదరాబాద్: సాధారణ వైద్య ప రీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రి లో చేరిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను పలువురు పా ర్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా తన ను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ ముఖ్యనేతల తో శుక్రవారం కెసిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరి యా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కెసిఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.కెసిఆర్‌ను కలిసిన వారిలో కెటిఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, జగదీష్‌రెడ్డి, వేము ల ప్రశాంత్‌రెడ్డి,
తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం గురువారం సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయులు పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వై ద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయని అన్నారు. కెసిఆర్ క్షేమం గురించి ఆరాతీస్తున్న అందరికీ కెటిఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.