Wednesday, April 30, 2025

ఇవాళ శాసనసభకు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ ఎంఎల్‌ఎగా ప్రమాణం

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కెసిఆర్ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో కెసిఆర్ గజ్వేల్ ఎంఎల్‌ఎగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కెసిఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటు న్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలందరినీ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News