Friday, May 30, 2025

విచారణకు కెసిఆర్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతారు
మాజీ ఎంపి వినోద్‌కుమార్ వెల్లడి
ఎర్రవెల్లిలో కెసిఆర్‌తో హరీశ్‌రావు భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ నుంచి మాజీ సిఎం కెసిఆర్‌కు నోటీసులు వచ్చాయని,వాళ్లు ఏం అ డిగినా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని బిఆర్‌ఎస్ నే త, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మే డిగడ్డ మరమ్మతులకు కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్.డి. ఎస్.ఎ రిపోర్ట్ అవసరం లేదని తాను ఇది వరకే చెప్పానని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే ఆ లోచించి విశ్లేషించి డిజైన్ చేసి రిపేర్ చేయాలని ఎన్.డి. ఎస్.ఎ సైతం చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారంమాజీ ఎంపి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి పాండ్యా నేతృత్వంలో

రిపేర్ చేయడానికి ప్రభుత్వం కమిటి వేసిందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరమ్మతులు చేయాలన్నారు. ఎన్‌డిఎస్‌ఎకు నిర్ణయాధికారం వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చే యవచ్చని మొదటి నుంచి తాను చెబుతూనే ఉన్నానని పే ర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు నిల్వ చేయకపోవడంతో నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమీ కాలేదని, మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా రి పేర్ పనులు ప్రారంభించాలని, ఈ విషయంలో ఉత్తమ్ కు మార్ రెడ్డి చొరవ తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు. కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే తమ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారని, అందరూ స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

కెసిఆర్‌తో హరీశ్‌రావు మరోసారి భేటీ –
కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు కెసిఆర్‌తో సమావేశమైన హరీష్‌రావు, తాజాగా బుధవారం మరోమారు భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లి ఆయన కెసిఆర్‌తో సమావేశమై కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కెసిఆర్‌తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న తేదీన కెసిఆర్, 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. నోటీసుల నేపథ్యంలో కెసిఆర్ ఇప్పటికే న్యాయనిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. నోటీసులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాలు, తదితరాల గురించి చర్చించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News