Monday, September 15, 2025

కెసిఆర్‌కు స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. కెసిఆర్ వెంట ఆయన కుమార్తె, ఎంఎల్‌సి కవిత కూడా ఆస్పత్రికి వెళ్ళారు. సిఎం కెసిఆర్‌కు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వచ్చారని ఎఐజి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిఎంకు ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేశారని, సిఎం కెసిఆర్ కడుపులో చిన్న అల్సర్‌ను కూడా గుర్తించామన్నారు. సిఎంకు మిగితా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయని వైద్యులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News