Monday, July 14, 2025

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెసిఆర్ విజన్‌కు సాక్ష్యం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెసిఆర్ విజన్‌కు మరో జీవన సాక్ష్యం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ అవడంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరం వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని తెలిపారు. మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్ అని, దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్ 72 గంటల కోడ్ (COౄ)ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి,

ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని అన్నారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరు అని, తరతరాలపాటు రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి నిజంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి నాయకుడు కెసిఆర్ దూరదృష్టి ఫలితంగా రెండు అద్భుత ఫలితాలను ఇప్పుడు తెలంగాణ సాధించిందని తెలిపారు. –తమ నాయకుడు కెసిఆర్ పాలన, విజన్ మా అందరికీ గర్వకారణమని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News