Friday, May 2, 2025

31 నుంచి కెసిఆర్ జిల్లాల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తీవ్ర ఎండలతో భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు ఎండిపోతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు జనగామలో కెసిఆర్ పర్యటించనున్నారు.

నీళ్లందక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని చెప్పేందుకు కెసిఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బిఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News