Wednesday, April 30, 2025

బిజెపిలో చేరిన మాజీ క్రికెటర్ జాదవ్..

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 39 ఏళ్ల జాదవ్.. ముంబయిలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జాదవ్ కు కమలం కుండవా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా.. 2014 నుండి 2020 వరకు ఇండియా తరపున ఆడిన జాదవ్ జూన్.. 2024లో అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News