- Advertisement -
చార్‌ధామ్ యాత్రలోభాగమైన కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది.ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని అలంకరిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలయిన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ ఆలయ సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని నలుమూలలనుంచి లక్షలాది మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఆలయం తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయమంతా మంచుతో కప్పబడి ఉంటుంది.
- Advertisement -