Thursday, September 4, 2025

ఎట్టకేలకు ఓ అవకాశం

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్‌కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. అదిగో ఇదిగో అని ఆమె పేరు పలు సినిమాల విషయంలో పరిశీలన వరకు వచ్చి బ్రేకులు పడుతున్నాయి. దీంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఈ అమ్మడు ఖాళీగా ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె పెళ్లి చేసుకొంది. పెళ్లి జరిగిన మూడు రోజులకే తన హిందీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంది. కేరీర్ విషయంలో అంత కమిట్‌మెంట్ చూపింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ముందే చెప్పింది.

కానీ పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కొత్తగా ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యలేకపోయింది. హిందీలో ఆమె మొదటి చిత్రం ఫ్లాప్ కావడం, తెలుగులో ఆమెని పెద్ద సినిమాల్లో తీసుకోకపోవడంతో గ్యాప్ పెరిగిపోయింది. తమిళంలో ఆమెకి మొదటి నుంచి అంతంతమాత్రంగానే అవకాశాలు వచ్చాయి. చివరికి ఈ భామకు తమిళంలో ఓ అవకాశం రావడం విశేషం. మిస్కిన్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాపైన ఎక్కువగా దృష్టి పెడుతోంది.

Also Read : లిటిల్ హార్ట్ హిట్ కావాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News