- Advertisement -
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఉప్పుకప్పురంబు”. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. వసంత్ మారింగంటి కథ అందించగా.. ఐ. వి శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని రాధిక లావు నిర్మిస్తున్నారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా వస్తున్న ఉప్పుకప్పురంబు అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీగా రానుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ వెల్లడించింది. జులై 4 నుంచి ఈ సినిమా స్ట్రిమింగుకు అందుబాటులోకి రానుందని చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో చూడొచ్చు.1990 నాటి బ్యాగ్రౌండ్ లో లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే ఒక గ్రామ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్.
- Advertisement -