Friday, August 29, 2025

అటవీ శాఖ మంత్రి మేనకోడలను చంపేసి… భర్త ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో అతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ మేనకోడలు శ్రీలేఖ(68)ను ఆమె భర్త ప్రేమరాజన్(75) హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అలవిల్ ప్రాంతంలో శ్రీలేఖ, ప్రేమరాజన్ కలిసి ఉంటున్నారు. ఈ దంపతుల కుమారులు ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. ప్రేమరాజన్ కుమారుడు విదేశాల నుంచి ఇంటికి వస్తుండడంతో అతడిని తీసుకరావడానికి కారు డ్రైవర్ ఇంటికి వచ్చాడు. పలుమార్లు పిలిచిన ఇంట్లో నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో బంధువులు, పక్కింటి వాళ్లకు సమాచారం ఇచ్చాడు.

స్థానికుల సహాయంతో బలవంతంగా డోర్లు ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడగా కాలిన మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రక్తపు మరకలతో ఉన్న సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీలేఖ తలపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బుధవారం నుంచి దంపతులను తాము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు అనవాళ్లు లేకపోవడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News