Sunday, August 10, 2025

లేరా తమ్ముడు మేము ఎవరికి రాఖీలు కట్టాలి…

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: రాఖీ పండగ రోజున తమ్ముడు చనిపోవడంతో ఐదుగురు అక్కలు విలపిస్తూ రాఖీలు కట్టారు. అక్కడ ఉన్నవారు కంటతడి పెట్టారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుంకరబోయిన చిన్న సోమయ్య, లక్ష్మమ్మ అనే దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు యాకన్న చిన్నవాడు కాగా మిగిలిన ఐదుగులు అక్కలు. గత కొన్ని రోజుల నుంచి యాకన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. శనివారం రాఖీ పౌర్ణమి కావడంతో తన తమ్ముడికి రాఖీలు కట్టేందుకు ఐదుగురు అక్కలు వెళ్లారు. అక్కలు వెళ్లే సమయానికి తమ్ముడి చనిపోయాడు.

దీంతో అక్కలు తమ్ముడి శవం వద్ద విలపించారు. మా ఐదుగురు తోడ ఒక్కగానొక్క తమ్ముడివి ప్రతి సంవత్సరం రాఖీలు కడుతుంటిమి తమ్మి అని విలపించారు. మాకు చీరలు సారెలు పెట్టి సాగనంపుతుంటివి అని శోకసంద్రంలో మునిగిపోయారు. తాము ఎవరికి రాఖీలు కట్టాలి, మాకు చీరెలు ఎవరు పెడుతారు తమ్మి అని మృతదేహంపై పడి విలపించారు. తమ్ముడి మృతదేహానికి రాఖీలు కడుతూ అక్కలు విలపించిన దృశ్యాలు అక్కడ ఉన్నవారికి కంటతడి పెట్టించాయి. రాఖీ పౌర్ణమి రోజు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News