Tuesday, July 22, 2025

సర్ఫరాజ్‌ని చూసి నేర్చుకో.. పృథ్వీషాకు పీటర్‌సన్ సలహా

- Advertisement -
- Advertisement -

భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆట బాగున్నప్పటికీ.. అతని ఫిట్‌నెస్ విషయంలో విమర్శలు ఎదురుకున్నాడు. అయితే ఇప్పుడు తిరిగి జట్టులో చోటు సంపాదించుకోనేదుకు తీవ్రంగా కృషి చేశాడు. రెండు నెలల్లో ఏకంగా 17 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఫిట్‌గా మారిన సర్ఫరాజన్‌ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్‌సన్ సర్ఫరాజ్ సన్నగా మారడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిట్‌సెన్ వల్ల అవకాశాలు కోల్పోయిన పృథ్వీషా.. సర్ఫరాజ్‌ను చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.

‘‘అద్భుతమైన ప్రయత్నం సర్ఫరాజ్..! నీకు అభినందనలు. మైదానంలో మరింత మెరుగైన, స్థిరమైన ప్రదర్శనకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతోందని ఆశిస్తున్నా. మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలనే సంకల్పంతో నువ్వు కష్టపడుతున్న తీరు నాకు ఎంతో నచ్చింది. సర్ఫరాజ్ సన్నగా మారిన విషయాన్ని పృథ్వీ షాకు చూపించండి. అతను కూడా ఇలా మారొచ్చు. ధృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది’’ అంటూ పీటర్‌సన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News