హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Ganesh) నిమజ్జనం పూర్తయింది. అంతకు ముందు తొమ్మిది రోజుల పాటు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని 9 రోజుల పాటు భక్తు దర్శించుకున్నారు. శనివారం ఉదయం శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ నుంచి వేలాది భక్తులతో శోభాయాత్ర ఘనంగా జరిగింది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందుకు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. యాత్రగా వచ్చిన బడా గణపతి క్రేన్ 4 వద్దకు చేరుకున్నారు. అక్కడ పలు పూజలు నిర్వహించారు. అనంతరం క్రేన్ సహాయంతో భక్తుల జయజయద్వానాల మధ్య నిమజ్జనం జరిగింది. ‘గణపతి బప్పా మోరియా’ అనే నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మారు మోగి పోయింది. బడా గణపతి నిమజ్జనం పూర్తి కావడంతో మిగితా గణనాథుల నిమజ్జనం నెమ్మదిగా సాగుతోంది.
Also Read : ఖైరతాబాద్ వినాయకుడికి పోటీ లేదు: రేవంత్ రెడ్డి