- Advertisement -
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు బడా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ కలశ పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ గణేశుడికి ఉత్సవ కమిటీ భారీ గజమాల వేసింది. సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 1.30 కల్లా మహా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. రెండు గంటలు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభం కావడంతో బడా గణపతి వేగంగా ముందుకు సాగుతున్నారు. వాహనాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలివస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం నెలకొంది.
Also Read: హైదరాబాద్ లో సిబిఐ డైరెక్టర్
- Advertisement -