Monday, September 15, 2025

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దుంప వేంకటేశ్వర రావు అనే వ్యక్తి, రోడ్డుపై ఆడుకుంటున్న ఒక చిన్నారికి చాక్లేట్ ఇస్తానని ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. పాపపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో చిన్నారి కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు గమనించి పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకొని దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News