Wednesday, August 20, 2025

ఖమ్మం వాసికి ఫోటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ అవార్డు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం కల్చరల్‌ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంసృ్కతిక కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపిసి), ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పిఏఐ) వారు ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్బంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ లో ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025ను ఖమ్మం జిల్లా ఖమ్మం కు చెందిన ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ఇనపాల శివకుమార్ అందుకున్నారు. విజయవాడ లోని బాలోస్తావ్ భవన్ లో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుక కార్యక్రమం లో ఈ అవార్డు ను కార్యక్రమ ముఖ్య అతిథి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పాయ్ వైస్ ప్రసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్, ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ తమ్మా శ్రీనివాస రెడ్డి, డా.అవనిగడ్డ ఎమ్మెల్యే మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ డా.గోకరాజు గంగరాజు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, సీఈఓ ఆర్.మల్లిఖార్జునరావు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా అధ్యక్షుడు గొల్ల నారాయణరావు, వెంకటరమణ, ఉపాధ్యక్షులు డాక్టర్ కొంపల్లి సుందర్ వివిధ రాష్టాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఖమ్మం జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక యువ ఫోటోగ్రాఫర్లు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే అద్భుత ఫోటోలతో పాల్గొన్నారు. ఈ కాంటెస్టులో ఇనుపాల శివ తన ప్రతిభను ప్రదర్శించి మొదటి బహుమతిని గెలుచుకోవడంతో పాటు, కన్సలేషన్ ప్రైజులను కూడా సాధించడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఖమ్మం మేయర్ నీరజ, కుమార్తపు మురళి, జిల్లా అధ్యక్షుడు మాగాని వెంకట్, మాజీ అధ్యక్షుడు దేవర నాగరాజు, పటాన్ హుస్సేన్ విజేతలకు బహుమతులను అందజేశారు. విజేత ఇనుపాల శివను అభినందిస్తూ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విజయం స్థానిక యువతకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు సాధిస్తారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీ జిల్లా యువతలోని సృజనాత్మకతను వెలికితీయడమే కాకుండా, వారిని ప్రోత్సహించే వేదికగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News