Monday, September 15, 2025

తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూకు పార్టీలో కీలక పదవి దక్కింది. వచ్చే ఏడాది తమిళనాడు అపెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆమెను రాష్ట్ర బిజెపి ఉనాధ్యక్షురాలిగా నియమించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అంగీకారంతో కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14 మంది నియమితులు కాగా జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. అలాగే బిజెపి రాష్ట్రప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, కార్యదర్శులుగా 14 మందితో కూడిన జాబితాను నాగేంద్రన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News