భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓ టోర్నమెంట్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. శనివారం హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 2118, 2422 తేడాతో జపాన్‌కు చెందిన యుషి తనకాను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు శ్రీకాంత్ అటు యుషి ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి గేమ్‌లో ఉత్కంఠత తప్పలేదు. అయితే చివరి వరకు నిలకడగా ఆడిన శ్రీకాంత్ సెట్‌ను దక్కించుకున్నాడు.
రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నటే జరిగింది. ఈసారి కూడా ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన శ్రీకాంత్ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్లో చైనా షట్లర్ లి షి ఫెంగ్‌తో శ్రీకాంత్ తలపడుతాడు. ఇక శ్రీకాంత్ తన కెరీర్‌లో చివరి 2019లో చివరిసారి ఫైనల్‌కు చేరాడు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఓ టోర్నమెంట్‌లో తుది పోరుకు అర్హత సాధించాడు.