Sunday, September 14, 2025

గంజాయి అమ్మడం లేదని… కిడ్నాప్ చేసి చితకబాదారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు (Kidnapped and beaten) కిడ్నాప్ చేసి చితకబాదారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో షాబాజ్, ఫయిమ్ అనే యువకులు గంజాయి విక్రయించేవారు. గత అర్దరాత్రి పన్నెండు గంటల సమయంలో గంజాయి కావాలని ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చారు. తమకు గంజాయి కావాలని దుండగులు కోరారు.

Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?

తాము విక్రయించడం లేదని చెప్పడంతో ఇద్దరిని వారు కిడ్నాప్ చేశారు. అనంతరం ఇద్దరిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని బండ్లగూడ వైపు నుంచి తలాబ్ కట్ట వరకు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులను దుండగులు (Kidnapped and beaten) చితకబాదారు. బాధితులు అక్కడ నుండి తప్పించుకుని భవాని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేయడానికి వినియోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News