Thursday, May 29, 2025

లవ్, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలతో..

- Advertisement -
- Advertisement -

శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా…విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్‌ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి కాంబినేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

అయితే ‘కిల్లర్‘ మూవీ గ్లింప్స్ తెలుగుతో పాటు కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘కిల్లర్‘ మూవీ గ్లింప్స్‌లో ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందించినట్లు గ్లింప్స్‌తో తెలుస్తోంది. మొదలెడదామా అంటూ గ్లింప్స్ చివరలో హీరో, డైరెక్టర్ పూర్వాజ్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న కిల్లర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News