Wednesday, July 23, 2025

తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జూలై 31న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్‌ను జూలై 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. తిరుపతి పట్టణంలోని నెహ్రూ స్టేడియంలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్ స్కేల్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎలా జరగబోతుందా అనే ఆసక్తి నెలకొంది. కింగ్‌డమ్ ప్రమోషన్స్‌లో బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భాగం కానున్నట్టుగా తెలిసింది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని.. సత్యదేవ్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

‘కింగ్‌డమ్’ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కింగ్‌డమ్ ట్రైలర్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌తో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరగనున్నాయి. కింగ్‌డమ్ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వీరతిలకంతో ఉన్న విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News