Saturday, August 2, 2025

విజయ్ ‘కింగ్‌డమ్’ సక్సెస్.. తొలి రోజే భారీ వసూళ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయ్ దేవరకొండ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా ఊహించినంత విజయం సాధించలేదు. తాజాగా ఆయన నటించిన ‘కింగ్‌డమ్’ (Kingdom Movie) సినిమా విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. అన్నాదమ్ముల మధ్య జరిగే ఎమెషనల్, యాక్షన్ స్టోరీ ఈ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లు రాబట్టిందో నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

ఈ సినిమా (Kingdom Movie) ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.39 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ తెలిపింది. వారంతంలో కాకుండా మధ్యలో విడుదల చేసినప్పటికీ.. ఈ స్థాయిలో కలెక్షన్లు రావడంపై హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఈ రాజు తన రాకతో బీభత్సం సృష్టించాడు’’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘‘మనం కొట్టినం’’ అని కామెంట్ పెట్టారు. ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. అక్కడ మొదటిరోజు రూ.2.6 కోట్లు కలెక్షన్లు వచ్చాయని నిర్మాత నాగవంశీ చెప్పారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. విజయ్ సోదరుడి పాత్రలో సత్యదేవ్ కనిపించారు. అన్న కోసం వెతిక తమ్ముడిగా, పోలీస్ కానిస్టేబుల్‌గా ఆ తర్వాత స్పైగా ఇలా వేర్వేరు పాత్రల్లో విజయ్ ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఎపిలో నిర్వహించనున్నారు. అంతేకాక.. విజయ్ త్వరలోనే యుఎస్‌కి వెళ్లి అక్కడి అభిమానులను కలవనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News