విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). స్పై యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 160 నిమిసాల నిడివితో ఈ సినిమా ఉండబోతుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాలో పలు కట్స్ చెప్పి.. ‘యూ/ఎ’ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు ‘‘భగత్’’ అనే ఒక టైటిల్ ప్రస్తావన తొలగించాలని కోరింది. అంతేకాక.. ఓ అసభ్యకర డైలాగ్‌ని తొలగించాలని వెల్లడించింది. హింస ఎక్కువగా ఉన్న సన్నివేశాలను సిజితో కవర్ చేయాలని పేర్కొంది.
ఈ సినిమాలో (Kingdom) భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ సినిమాప అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మరికాసేపట్లో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది.