Wednesday, May 14, 2025

‘కింగ్‌డమ్‌’ రిలీజ్ డేట్ ప్రటించిన మేకర్స్..

- Advertisement -
- Advertisement -

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, తొలి సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు సాంగ్ చూస్తే అర్థమవుతోంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. జులై 4న ‘కింగ్‌డమ్‌’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల విడుదల కానుంది. కాగా, విజయ్ ఈ సినిమాతోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను కూడా మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News