విజయ్ దేవరకొండ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులం తా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవ ర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ని ర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సం గీతం అందిస్తున్నారు. గురువారం ప్రేక్షకుల ము ందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జ రిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిర థ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అభిమాను లు నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సి నిమా పని మీదే ఉన్నాడు గౌతమ్. ఒక పర్ఫెక్ట్ సిని మా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు.
ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పా టలు ఇప్పటికే విన్నాము. నేపథ్యం సంగీతం కూ డా అదిరిపోతుంది. తన సంగీతంతో సినిమాని మ రో స్థాయికి తీసుకెళ్ళాడు. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించా డు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కా దు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అ ద్భుతంగా నటించాడు”అని అన్నారు. సంగీత ద ర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. “సోదరుడు గౌతమ్ దర్శకత్వం వహించిన ’జెర్సీ’ చి త్రానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ’కింగ్‌డ మ్’ అంతకుమించిన విజయం సాధిస్తుందనే న మ్మకం ఉంది. ఈ సినిమా విడుదల కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
సిని మా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించా రు. నేను ’కింగ్‌డమ్’ చిత్రం చూశాను. ఈ సినిమా విజయ్ కెరీర్‌తో పాటు, నా కెరీర్‌లో, గౌతమ్ కెరీర్‌లో, నాగవంశీ కెరీర్‌లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది”అని తెలిపారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “ఇలాంటి గొప్ప సినిమాలో విజ య్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషం గా ఉంది. గౌతమ్ ఎంతో ప్రతిభగల దర్శకుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీకి కృతఙ్ఞతలు”అని తెలియజేశారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సత్యదేవ్, వెంకటేష్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అవినాష్ కొల్లా, నీరజ కోన, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.