Wednesday, September 17, 2025

ఆ నమ్మకంతోనే బిజెపిలో చేరా: కిరణ్‌కుమార్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదవులు ఆశించి బిజెపిలో చేరలేదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

’అధిష్ఠానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోంది. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తాం అన్నారు. వద్దని చెప్పా. నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్తపడాలి. కింద పడి పగిలాక నీళ్లను సీసాలో పోయలేమని చెప్పా. ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే బిజెపిలో చేరా” అని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News