Friday, August 22, 2025

హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదు : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వల్ల హైదరాబాద్ పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే కాదని, స్థిరాస్తి వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించారని తెలియజేశారు. డ్రైనేజీల్లో పూడికలు తీయడం లేదని, మంచినీటి పైపులైన్లు వేయడం లేదని మండిపడ్డారు.

హైదరాబాద్ ను విశ్వనగరం (Hyderabad cosmopolitan city) చేస్తామని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, అంతకంటే ఎక్కువ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. జిహెచ్ఎంసికి నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, జిహెచ్ఎంసి పనులు చేసిన కాంట్రక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదని విమర్శించారు. జిహెచ్ఎంసి పనులకు టెండర్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News