తెలంగాణ, కర్నాటకలో జరిగింది
నామమాత్రపు కులగణనే మండల్
కమిషన్ సిఫార్సులను పక్కన
పెట్టింది మీరు కాదా? సామాజిక
న్యాయం దిశగానే మా నిర్ణయం…
ఒత్తిడితో తీసుకున్నది కాదు
బిసిల్లో మేం మైనారిటీలను చేర్చం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన రోల్ మోడల్ కాదని, రాంగ్ మోడల్ అని కేంద్ర మంత్రి గంగాపురం కి షన్ రెడ్డి అన్నారు. ఎడ్లబండి కింద వెళ్లే కుక్క తానే బరువు మోస్తున్నట్లుగా భావిస్తుంటుందని, ఇప్పు డు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో వాగ్దానాలు త ప్ప వాస్తవాలు ఏమీ లేవని అన్నారు. బీసీలకు న్యా యం చేకూర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి న కాంగ్రెస్ పార్టీ కులగణన ఊసే ఎత్తలేదని, ఇ ప్పుడు దానిపై రాజకీయ లబ్ధి పొందాలని చూడ టం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సమగ్ర కులగణన జరగలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బీసీలకు మే లు చేస్తుందన్న మండల్ కమిషన్ సిఫార్సులను సై తం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీల ప్ర యోజనాలను విస్మరించి, ముస్లింలకు అధిక ప్రా ధాన్యత ఇస్తూ వస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్‌లా ముస్లింలను బీసీల జాబితా లో చేర్చి,
బీసీల గణాంకాలను తప్పుగా చూపించే ప్రయత్నం చేయదని ఆయన స్పష్టం చేశారు. కేం ద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్ ఇచ్చిన లేఖకు క ట్టుబడి కులగణనపై తాము నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాని కాం గ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు భయపడి తా ము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో జనగణన చేసేటప్పుడు కులగణన చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పారని ఆయన గుర్తు చేశారు. దేశానికి, సమాజానికి మేలు చేసే నిర్ణయాలను తీసుకునే దమ్ము తమకు ఉందని చెప్పారు. అంతకానీ ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే స్టేజ్‌లో తాము లేమన్నారు. ఇది సానుకూలమైన మార్పుకు నాందిగా ఆయన అభివర్ణించారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు రాజకీయ నాటకాలకు తెర లేపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బీసీల్లో చేర్చే కుట్ర చేసిందని ఆరోపించారు.
బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు :
బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌లో భాగంగా 10 రిజర్వేషన్లు దక్కని వారికి కూడా రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ రద్దు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకు వచ్చామని గుర్తు చేశారు. కులగణనకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, మొదటి జనగణనలో కులగణన చేశారన్నారు. బీసీల కంటే ముస్లింలే వెనకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాలని మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ మాజీ నేత రాజీవ్ గాంధీది అని గుర్తు చేశారు. బీసీలను పక్కన పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులగణనకు వ్యతిరేకం :
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కులగణను వ్యతిరేకిస్తూనే ఉందని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి బరిలో నిలిచిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అలాగే దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణనను వ్యతిరేకిస్తూనే ఉందని పలు ఉదాహరణలు చెప్పారు.అవసరం లేకున్నా ముస్లింలను బీసీల్లో చేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర కేబినెట్ లో చర్చించి కులగణనపై ఎన్డీయే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని, కానీ రాహుల్ గాంధీ మాత్రం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తన ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారత దేశానికి ఉపయోగపడే ఎంతటి నిర్ణయాన్ని అయిన దేశం కోసం, దేశ ప్రజల కోసం మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పారు. త్వరలో బీజేపీ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రాతిపదికన ఏ వర్గాన్ని బీసీల్లో చేర్చబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన, కులగణనపై ఆ పార్టీ నేతలకు ఏకాభిప్రాయం లేదని, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలు, తాత్కాలిక లాభం కోసమే తీసుకుంటుందని, దీనికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే సాక్షం అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.