Thursday, August 21, 2025

ఆ బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ ఎందుకు బాధపడుతోంది?: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభలో ఇండియా కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రాజ్యాంగ సవరణను దేశమంతా స్వాగతిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ ఎందుకు బాధపడుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల కోసం ఈ బిల్లు తీసుకురాలేదని, అన్ని పార్టీలకు ( all parties) వర్తించేలా బిల్లు తీసుకొచ్చామని కిషన్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మద్దతు ఎవరడిగారు? అని నిలదీశారు. చైనా, ఉక్రెయిన్ నుంచి రావాల్సిన యూరియా కొంత ఆలస్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అడిగినా అడగపోయినా యూరియా ఇస్తామని తెలియజేశారు. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News