Saturday, August 23, 2025

కళ్ళు పీకి గోలీలు ఆడుతారా?: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్న భాష పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను సైంధవుడు అని అన్నారని ఆయన తెలిపారు. కళ్ళు పీకి గోలీలు ఆడుకుంటానని, తొండలు పెడతామని, పేగులు తీసి మెడలో వేసుకుంటానని, హవులగా.. ఇలా రకరకాలుగా పరస్పర విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ స్క్రిప్ట్ చదువుతున్నానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ తాను ఆర్‌ఎస్‌ఎస్ కాబట్టి చదువుతానని అన్నారు. ఇది తెలంగాణ భాష కాదన్నారు. రాజకీయాల్లో శతృవులు ఉండరాదని, ప్రత్యర్థులు మాత్రమే ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News