ఎక్స్‌లో ప్రధానిమోడీని ఘోరంగా అవమానించారు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: పాకిస్తాన్ ఆ లోచనల ప్రకారమే దేశంలో కాం గ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అ ధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రె స్ పార్టీ బాధ్యతను రాహుల్ గాంధీ మరిచిపోయారని, ప్రధాని మోడీపై విమర్శలు చే యడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తా రు. మోడీ తల లేని ఫొటోను కాంగ్రెస్ సోష ల్ మీడియా ట్విట్టర్ పెట్టి అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవా రం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధా ని ఫోటో మార్ఫింగ్ చేయడంపై బిజెపి ఢిల్లీలో ఫిర్యాదు చేసిందని తెలిపా రు. కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కించపరిచేలా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా నుంచి తల లేని నేత ఫొటోను గాయబ్ అనే స్లోగన్‌తో పోస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ నేషనల్ కాం గ్రెస్ కాదు, లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అంటూ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.