Saturday, July 19, 2025

అద్భుతమైన సహజ వనరులున్న రాష్ట్రం.. తెలంగాణ: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని బిజెపి ఆఫీస్ లో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కారక్రమంలో ఎంపి ఈటల రాజేందర్, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన పోరాటం ప్రపంచ చరిత్రలో లిఖించబడిందన్నారు. “తెలంగాణ అమరవీరులకు నా నివాళులు. వెలకట్టలేని సాంస్కృతిక వైభవం మన సొంతం. అద్భుతమైన సహజ వనరులున్న రాష్ట్రం మన తెలంగాణ. భారత్ అభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక పోషించాలి” అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం చేస్తే.. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News