Friday, May 16, 2025

భారత్‌పై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

- Advertisement -
- Advertisement -

దేశంలో గత యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగాయని, అప్పుడు సంఘటనలు జరిగినప్పుడు కేవలం సంతాపాలు ప్రకటించి మరిచిపోయే వారని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తరువాత భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌ను అంతం చేసి నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నా రు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌పై దాడి చేస్తే తాము క్యాండిల్ లైట్స్ వెలిగిం చం, బ్రహ్మోస్ ప్రయోగిస్తాం అనే ధైర్యాన్ని కనబర్చారని, పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్స్, పఠాన్ కో ట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారని చె ప్పారు.

పహల్గామ్లో భార్యల కళ్లముందే భర్తలను ఉగ్రవాదులు క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రో త్సహించినా, భారత సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్ర యత్నం చేసినా ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చే శారు. ఈనెల 17న ట్యాంక్ బండ్‌పై నిర్వహించే తి ంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేయడానికి మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలు, ఎన్జీవోలు, అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతంగా పాల్గొనేలా పనిచేయాలని సూచించారు.

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానం తాకట్టుపెట్టారు
తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు క డిగించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆ త్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గి రిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్ర భుత్వం అహంకారానికి నిదర్శనమని మండి ప డ్డా రు. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్య త అని, దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్య వహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఇందుకు సోనియా, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News