Saturday, July 19, 2025

కెసిఆర్ మేధావిలా, శాస్త్రవేత్తలా మాట్లాడలేదా?: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః గతంలో బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోసన్ రెడ్డిని ప్రగతి భవన్‌కు ఆహ్వానించి నీటి విషయంలో అపర మేధావిలా, ఇంజనీర్‌లా, శాస్త్రవేత్తలా మాట్లాడారని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తాము కో-ఆపరేటివ్ ఫెడరలిజాన్ని గౌరవిస్తున్నామని, అందుకే బనకచర్ల విషయంలో కూడా వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించిందని ఆయన వివరించారు.

కేంద్రం తీర్పు చెప్పదని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి వేదిక ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. పాలసినీ తరచూ మార్చుకునే వారి వ్యాఖ్యలు స్థిరంగా ఉండవని అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు. ‘పక్క రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని మేము మొదటి నుంచి భావిస్తున్నాం, నేను స్వయంగా మహారాష్ట్ర వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి, దశాబ్దాలుగా ఉన్న ఆంధ్రమహారాష్ట్రకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొన్నాను.

వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలు అని భావించాం, అదేవిధంగా గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం..’ అని కెసిఆర్ అన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా తమకు భేషజాలు లేవు, బేసిన్ల గొడవలు లేవు, అపోహలు అవసరం లేదు, వివాదాలు కావాలనుకుంటే మరో తరం వరకు కూడా నీళ్ళు ఇవ్వలేం, కెసిఆర్‌జగన్ వ్యక్తిగతంగా ఆలోచించరు, ప్ర జలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు, వారికి మేలు చేయడమే మా ఇద్దరి బాధ్యత .. అని కూడా కెసిఆర్ అన్నట్లు ఆయన వివరించారు. బనకచర్ల విషయంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకే తాను స్వయంగా ్ర పధాని నరంద్ర మోదీని, జలశక్తి మంత్రిని కలిసిన తర్వాతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ..
కాజిపేట కోచ్ ప్యాక్టరీ సమస్య పరిష్కార దశలోకి వచ్చిందని ఆయన చెప్పారు. పలు రాజకీయ పార్టీలు పలు పర్యాయాలు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించాయని ఆయన గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కాజిపేట రైల్వే జంక్షన్ పరిథిలో ఏర్పాటు చేస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు భూమి పూజ చేశారని, అరవై, డ్బ్బై శాతం పనులు పూర్తి కావచ్చాయని ఆయన తెలిపారు.
యూరియా కొరత లేదు..
తెలంగాణకు యూరియా కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై అనుమానాలు, అపొహలు అవసరం లేదన్నారు. కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.
గుట్టకు ట్రైన్ విస్తరణ పనులు..
యాదగిరిగుట్ట వరకూ ౩౩౦ కోట్ల రూపాయలతో రైలు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి హైదరాబాద్ నుంచి వెళ్ళే నేపథ్యంలో అక్కడ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన చెప్పారు. వచ్చే జనవరిలో కొమురవెల్లి స్టేషన్‌ను పూర్తి చేసి మల్లన్న స్వామికి అంకితం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శంషాబాద్ తరహాలో రూ.720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News