Wednesday, April 30, 2025

కిష్కింధపురి నుంచి అద్భుతమైన ఫస్ట్ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’కిష్కింధపురి’. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు, అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న కిష్కింధపురి ఒక యూనిక్ ప్రపంచంలో సెట్ చేయబడింది. అద్భుతమైన హర్రర్- మిస్టరీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు విడుదలైంది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఒక హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళడంతో కథ మొదలవుతోంది. ‘కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు‘ అని టీజర్ సూచిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అహం మృత్యువు‘అనే డైలాగ్ ని ఇంటెన్స్ గా చెప్పే టెర్రిఫిక్ మూ మెంట్‌లో ట్రైలర్ ముగుస్తుంది. ఫస్ట్ గ్లింప్స్ స్పైన్ చిల్లింగ్ ప్రివ్యూను అందిస్తుంది. ఈ మాన్సూన్ లో ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ గ్లింప్స్ టెక్నికల్‌గా విజువల్ వండర్ గా ఉంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సామ్ సిఎస్ హంటింగ్ స్కోర్‌తో అదిరిపోయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News