Wednesday, September 3, 2025

‘కిష్కింధపురి’ వచ్చేది అప్పుడే !

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ థ్రిల్లర్ ’కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్‌ని చూపించారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “కిష్కింధపురి సినిమాతో మంచి థియేటర్ సినిమాటిక్ అనుభవాన్ని ఇవ్వబోతున్నాం. మా డైరెక్టర్ చాలా అద్భుతమైన కథతో ఈ సినిమా చేశారు. ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమాతో థియేటర్స్ దద్దరిల్లిపోతాయి”అని అన్నారు.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ “డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ కౌశిక్‌కి థాంక్యూ. సాయితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ “సాయి, అనుపమ కలిసి చేసిన రాక్షసుడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా అందరి అంచనాలకు మించి ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ “ఖచ్చితంగా ఆడియన్స్‌కి సినిమా నచ్చుతుంది. మా హీరో, హీరోయిన్, టీమ్ అందరూ చాలా కష్టపడి పని చేశారు. వారి కష్టానికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా ఇదవుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News