Friday, August 15, 2025

భయపెడుతున్న ‘కిష్కందపురి’ టీజర్.. మీరు చూసేయండి..

- Advertisement -
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindhapuri). మిస్టరీ, హారర్, థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపేలా ఉంది. ఆరంభం నుంచి చివరి వరకూ ఈ టీజర్ భయపెడుతోంది. సినిమాలో హారర్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని టీజర్‌ చూస్తే మనకు అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా.. అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News