Saturday, July 5, 2025

భర్తతో కలిసి ప్రియుడ్ని చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: భర్తతో కలిసి భార్య ప్రియుడిని చంపింది. ఈ సంఘటన జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంగమ్ సార్తల్ ప్రాంతంలో సందీప్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఉజ్లి దేవితో కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. లోయర్ బిడ్డలోని పవన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. పవన్ కుమార్‌తో ఉజ్లిదేవీ వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అక్రమ సంబంధం సందీప్‌కు తెలియడంతో దేవీతో గొడవకు దిగాడు. దేవీ తన భర్త సందీప్‌తో కలిసి పవన్ హత్య చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్‌లో భాగంగా పవన్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ప్రియురాలు కబరు పంపింది. ఇంట్లోకి వచ్చిన ప్రియుడి భర్తతో కలిసి ప్రియురాలు హత్య చేసింది. వెంటనే మృతదేహాన్ని బైక్ పై పెట్టుకొని రోడ్డు పక్కన పడేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం పవన్‌ది గుర్తించారు. వెంటనే దర్యాప్తులో భాగంగా ఉజ్లీదేవినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన భర్తతో కలిసి ప్రియుడ్ని హత్య చేశానని ఒప్పుకుంది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News