Thursday, July 31, 2025

కెకెఆర్ కీలక నిర్ణయం.. కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు అంతగా రాణించలేదు. 2024లో టైటిల్‌ని గెలుచుకున్న కెకెఆర్ 2025 ఐపిఎల్‌లో మాత్రం ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. 14 మ్యాచుల్లో కేవలం 5 మ్యాచుల్లో గెలిచి.. పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌ ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. కెకెఆర్‌కు మాత్రం ఊహించని షాక్ తగిలింది. జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్.. ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కెకెఆర్ మంగళవారం తెలియజేసింది.

అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో జట్టు (KKR) యాజమాన్యం నిమగ్నమైంది. ఈ క్రమంలో కెకెఆర్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ పేరును పరిశీస్తున్నట్లు సమాచారం. 2020, 2021 సీజన్లలో మోర్గాన్ కెకెఆర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో 24 మ్యాచులు ఆడిన కెకెఆర్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇప్పుడు కోచ్‌గా కెకెఆర్ భవిష్యత్తును మోర్గాన్ ఎలా మారుస్తాడో చూడాలి. అయితే చంద్రకాంత్ పండిట్‌తో పాటు జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ కూడా కెకెఆర్‌ను వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అతను చెన్నై సూపర్ కింగ్స్‌తో జతకట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News