- Advertisement -
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస ఓటములతో ప్లేఆఫ్స్ ఆశలను కోల్పోయిన రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయంతో జోష్‌లో ఉన్న కెకెఆర్.. ఈ మ్యాచ్‌లోనూ ఆదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మూడు మార్పులు చేసింది. హసరంగా, కునాల్ రాథోర్, యుద్వీర్‌లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు కోల్‌కతా జట్టులో రెండు మార్పులు చేసింది. మొయిన్, రమణ్‌దీప్‌లు టీంలోకి వచ్చారు.
- Advertisement -