- Advertisement -
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన చెన్నై.. ఆడే చివరి మ్యాచుల్లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని ఆశ పడుతోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టులో ఒక మార్పు చేయగా.. చెన్నై రెండు మార్పులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీశ్ పాండే కోల్‌కతా జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై విషయానికొస్తే.. రషీద్, కర్రన్‌ల స్థానంలో కాన్వాయ్, ఉర్విల్ పటేల్‌ని జట్టులోకి తీసుకున్నారు.
- Advertisement -